టీమిండియా సింగిల్స్ తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ప్రత్యర్థి జట్టు లోని బ్యాట్స్మెన్లు మాత్రం సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. అయితే కనీస లక్ష్యాన్ని కూడా నిర్దేశించడం లో విఫలం అవుతుంది టీమ్ ఇండియా జట్టు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో అతి కష్టం మీద 150 పరుగులు చేసిన భారత జట్టు..ఇక రెండో మ్యాచ్లో అయితే పూర్తిగా చేతులెత్తేసింది. ఒకానొక సమయంలో కనీసం వంద పరుగులు అయినా చేయగలదా అన్న అనుమానం కలిగింది. చివరికి 111 పరుగులు చేసి ప్రత్యర్థి సునాయాసంగా గెలిచే ఒక లక్ష్యాన్ని ముందు ఉంచింది. దీంతో ముప్పై మూడు బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది.
అయితే వరల్డ్ కప్ లో టీమిండియా ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఒక ట్రోల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవలే రెండో మ్యాచ్ లో కోహ్లీసేన కొట్టిన స్కోర్ భారత్ లో లీటర్ పెట్రోల్ ధర కన్నా తక్కువే.. శభాష్ టీమిండియా అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. అదే సమయంలో అటు ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో విఫలమవుతున్న వారిని ఉద్దేశిస్తూ ఐపీఎల్ బ్యాన్ చేయాలి అంటూ ఎన్నో పోస్టులు కూడా పెడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి