సాధారణంగా క్రికెటర్లు ఎంత కింది స్థాయి నుంచి వచ్చినప్పటికీ ఒక్కసారి అంతర్జాతీయ క్రికెట్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు అంటే చాలు ఇక ఆ తర్వాత భారీగా డబ్బులు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇలా ఒక్కసారిగా క్రేజ్ సంపాదించిన తర్వాత క్రికెటర్లు కూడా లగ్జరీ లైఫ్ కి బాగా అలవాటు పడి పోతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతో ఖరీదైన దుస్తులు ధరించడం ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో క్రికెటర్లు ఏదైనా కొత్తగా కొనుగోలు చేశారు అంటే చాలు దాని విలువ ఎంత అన్న దానిపై మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది.


 అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లైఫ్ స్టైల్ గురించి కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో  ఏదో ఒక విధంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. విరాట్ కోహ్లీ ధరించిన వాచ్ గురించి.. విరాట్ కోహ్లీ ధరించే దుస్తుల గురించి.. వాడే కార్లు గురించి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అంశాలపై కూడా చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే విరాట్ కోహ్లీ కూడా కాస్ట్లీ బ్రాండ్ కొనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం విరాట్ కోహ్లీ వాడే వాలెట్ గురించి ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది.



 సాధారణంగానే కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ ఎక్కువగా కాస్లీ వస్తువులు వాడటానికి ఇష్టపడుతూ ఉంటారు. విరాట్ కోహ్లీ వాడే వాలెట్ విషయంలో కూడా ఎంతో కోహ్లీ కాస్త కాస్ట్లీ గా నే ఆలోచించినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ వాడే వాలెట్ 50 వేల నుంచి 75 వేల రూపాయల వరకు ఉంటుందట. ప్రస్తుతం సంపన్నుల కొనుగోలు చేస్తే కాస్ట్లీ బ్రాండ్ గా పేరు పొందిన లౌయిస్ ఉట్టన్ అనే కంపెనీ కి చెందిన వాలేట్ నే విరాట్ కోహ్లీ వాడుతాడట. అయితే విరాట్ కోహ్లీ వాడే వాలేట్ 75 వేల వరకు ఉంటుంది అన్నది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: