నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన మ్యాచ్లో చివరి ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి టి20 వరల్డ్ కప్ ఫైనల్ లోకి అడుగుపెట్టిన రెండవ జట్టుగా నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య నేడు ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. సాయంత్రం ఏడున్నర గంటలకు జరగబోయే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేక్షకులు మొత్తం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే ఫైనల్ పోరులో ఎవరు విశ్వవిజేతగా నిలువబోతున్నారు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇక ఈ ఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ క్రికెట్ గురించి తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కూడా నేడు జరగబోయే టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే న్యూజిలాండ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ తనకు ఎంతగానో నచ్చుతుంది అంటూ తెలిపాడు. కాగా ఇక గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారగా.. గౌతం గంభీర్ పోస్టుపై నెటిజన్లు భిన్నమైన కామెంట్ లు పెడుతూ ఉండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి