ఇప్పటికే భారత క్రికెట్ లో ఎంతో మంది క్రికెటర్లు సినిమా హీరోయిన్ల ను ప్రేమించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు యువ క్రికెటర్ పృద్విషా. ప్రస్తుతం భారత క్రికెట్లో యువ సంచలనంగా మారిపోయిన పృద్విషా ఎంత అద్భుతంగా దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటూ తన పాటలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇకపోతే గత కొంత కాలం నుంచి యువ ఆటగాడు పృద్విషా బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ సింగ్ తో సన్నిహితంగా ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఇద్దరు ఎన్నోసార్లు డిన్నర్, డేట్స్ వెళ్తూ కెమెరా కంటికి చిక్కి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరు వీరి ప్రేమ విషయం పై ఎక్కడ స్పందించ లేదు అని చెప్పాలి. కాగా వీరికి సంబంధించి ఏదైనా ఫోటో సోషల్ వీడియో లోకి వచ్చింది అంటే చాలు అది క్షణాల్లో వ్యవధిలో వైరల్‌గా మారిపోతూ ఉంటుంది. అయితే పృథ్వీషా ప్రాచీ రిలేషన్షిప్ లో ఉన్నారు అంటూ ఎన్నో రోజుల నుంచి వస్తున్న వార్తలకు ఇటీవలే ప్రాచి ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. పృద్విషా తో ఎంతో క్లోస్ గా దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో పృద్విషా తో రిలేషన్ షిప్ ని ప్రాచీ అఫీషియల్‌గా ప్రకటించింది అంటూ కొంతమంది భావిస్తున్నారు.