ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 26వ తేదీన మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది అని చెప్పాలి. సెంచూరియన్ వేదికగా ఇప్పటివరకు తిరుగులేని విజయాలను సాధించింది సౌతాఫ్రికా జట్టు. అలాంటిది  మైదానంలో టీమిండియా అద్భుతంగా రాణించి సొంతగడ్డపై సౌత్ఆఫ్రికా జట్టును మట్టికరిపించింది. భారీ పరుగుల తేడాతో  విజయం సాధించింది. ఇక వరుసగా రెండు ఇన్నింగ్స్ లో కూడా అద్భుతంగా రాణించింది టీమిండియా. 113 పరుగుల తేడాతో విజయ ఢంకా  మోగించింది.



 అయితే అటు సౌత్ ఆఫ్రికా జట్టు సొంతగడ్డపై కూడా టీమిండియాకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది అనే చెప్పాలి. కాగా ఇక నేడు రెండవ టెస్ట్ మ్యాచ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇక ఈ రెండో టెస్టు మ్యాచ్ లో ఎవరు విజయం సాధించపోతున్నాను అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ భారీ తేడాతో విజయం సాధించి పూర్తిస్థాయి ఆత్మ విశ్వాసంతో ఉంది టీమిండియా. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.. అదే సమయంలో మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓటమిపాలై నిరాశతో ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు ఈసారి తప్పకుండా విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది..


 ఇకపోతే టీమిండియాకు మంచి రికార్డు ఉన్న జోహన్నెస్బర్గ్ వేదికగా మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది   అయితే తొలిసారి దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలిచి చరిత్ర తిరగరాయాలి అని భావిస్తోంది భారత జట్టు. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత్ గెలిచింది అంటే దాదాపు సిరీస్ గెలిచినట్లే అవుతుంది. అయితే  ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ కి అటు వరుణుడు ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మొదటి మ్యాచ్లో రెండవ రోజు వర్షం కారణంగా ఒక రోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. ఇక ఇప్పుడు వరుణుడు కరుణించక పోతే రెండవ మ్యాచ్ కూడా ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం మైదానంలో తలపడే రెండు జట్లలో  ఒక జట్టు గెలుస్తుందా లేక వరుణుడు గెలుస్తాడా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: