పుజారా వివరించిన ప్రకారం.. మ్యాచ్‌లో నాలుగవ రోజు మొదటి గంటే చాలా కీలకం. మూడవ రోజు ఆట ముగిసిన అనంతరం విలేకర్ల సమావేశానికి వచ్చిన పుజారా మాట్లాడారు. పిచ్‌పై హెవీ రోలర్ ను పరిత్తించిన తీరు కాస్త ఊరటనిచ్చింది. మళ్లీ పిచ్ పగుళ్లు రావడానికి సమయం పడుతుంది. గంట తరువాత కచ్చితంగా పిచ్‌పై అసమాన బౌన్స్ ఉంటుంది. ఈ పరిస్థితిలో ప్రారంభంలో గంట జాగ్రత్తగా ఆడడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ వికెట్ కూడా చాలా ముఖ్యమైనది పుజారా పేర్కొన్నారు.
వెన్నునొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ టెస్ట్‌కు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలో కంటే మెరుగుగా ఉన్నాడని.. త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్ ను పుంజుకుంటున్నాడని తెలిపారు పుజారా. అధికారికంగా నేను మరిన్నీ విషయాలను వెల్లడించలేనని.. కోహ్లీ ఇప్పుడు కచ్చితమైన మెరుగైన స్థితిలో ఉన్నాడు. త్వరలో ఫిట్ అవుతాడని నేను భావిస్తున్నట్టు పుజారా చెప్పారు. వెన్నునొప్పి కారణంగా కోహ్లీ రెండవ టెస్ట్‌కు దూరం అయ్యాడు. అతని స్థానంలో కే.ఎల్. రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నారు. కోహ్లీ ఫిట్‌నెస్‌పై జట్టు ఫిజియో కచ్చితమైన స్థితిని చెప్పగలడు అని పుజారా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి