ఇండియాలో బీసీసీఐ నేతృత్వంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే నచ్చని వారు ఎవరైనా ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇందులో ఆడేందుకు ఛాన్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. ఇప్పటి వరకు విజయవంతంగా ఐపీఎల్ 15 సీజన్ లను పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం ఐపీఎల్ 16 వ సీజన్ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా టీమ్ లను ప్లేయర్స్ తో నింపే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఫిబ్రవరి 12 మరియు 13 వ తేదీలలో ఐపీఎల్ 16 సీజన్ కు సంబంధించి బెంగుళూరు వేదికగా మెగా వేలం జరగనుంది. ఇందులో పాల్గొనాలని ఆసక్తి కలిగిన ప్లేయర్స్ కోసం ఆఖరి తేదీని బీసీసీఐ ఇప్పటికే తెలిపింది.

మరో రెండు రోజుల్లో ఆ గడువు ముగియనుంది. కానీ ఇప్పటి వరకు కొంత మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేయించుకోలేదని సమాచారం. అందులో ఆసీస్ పేస్ గన్ మిచెల్ స్టార్క్  ఒకరు. గత రెండు రోజుల క్రితమే యాషెస్ టెస్ట్ లో పాల్గొన్న మిచెల్ స్టార్క్ ఇంకా తన పేరును ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ చేయించుకోకపోవడంతో, ఇతను ఐపీఎల్ 16 వ సీజన్ లో పాల్గొనడానికి ఆసక్తి ఉందా లేదా అనే కోణంలో బీసీసీఐ ఆలోచిస్తోంది. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం తీరిక లేని షెడ్యూల్ కారణంగా మిచెల్ స్టార్క్ ఈ ఐపీఎల్ కు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

స్టార్క్ మేనేజర్ కూడా ఈ విషయం గురించి ఏమీ స్పందించకపోవడం ఈ అనుమానానికి తావిస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ ఐపీఎల్ లో ఆడడానికి విముఖత చూపిన విషయం తెలిసిందే. ఇందుకు మరొక కారణం కొద్ద హైలైట్ అవుతోంది. ఐపీఎల్ లో గడిపే రెండు నెలల కాలంపాటు బయో బబుల్ లో ఉండలేక కూడా చాలా మంది  ఆసక్తి చూపకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: