ప్రపంచ క్రికెట్లో అతను ఒక అత్యుత్తమ క్రికెటర్.. ప్రతి ఒక బౌలర్ అతని వికెట్ ఒక్కసారి తీస్తే చాలు కెరియర్ లో గొప్ప రికార్డు సాధించినట్లే అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో గొప్ప రికార్డులను బద్దలు కొట్టిన సత్తా అతని సొంతం. అందుకే అభిమానులు అందరూ అతన్ని రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు. ఇక మూడు ఫార్మాట్లలో కూడా అత్యుత్తమ ఆటగాడిగా నెంబర్ 1 స్థానంలో కొనసాగాడు అతగాడు. కానీ ఇప్పుడు ఏమైందో అతని ఆట తీరుతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక ఆ ఆటగాడు ఎవరో కాదు మొన్నటి వరకు భారత జట్టు కెప్టెన్గా కొనసాగితూ ఇక ఇప్పుడు సాదాసీదా ఆటగాడిగానె జట్టులో కొనసాగుతోన్న విరాట్ కోహ్లీ. మొన్నటి వరకు మూడు ఫార్మాట్లకు కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించాడు.



 టీమిండియాకు ఎన్నో మంచి విజయాలను అందించాడు. కానీ ఇప్పటివరకు ఒక్క ఐసిసి ట్రోఫీని మాత్రం గెలిపించలేక పోయాడు. దీంతో టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఇక అటు వెంటనే టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్న అంటూ షాక్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. తాను కెప్టెన్సీ వల్ల ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నారని కెప్టెన్సీ వదులుకున్న తర్వాత బ్యాటింగ్ పై దృష్టి పెట్టడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పాడు.  కోహ్లీ చెప్పింది అంతా బాగానే ఉంది. కానీ వరుసగా కెప్టెన్సీ వదులుకుంటూ ఉన్నప్పటికీ కూడా కోహ్లీ బ్యాటింగ్  తీరులో మాత్రం మార్పు రావడం లేదు.


 ఒకప్పుడు అద్భుతంగా రాణిస్తూ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం అసలు పరుగులు చేయకుండా వికెట్ చేజార్చుకున్నాడు  అని చెప్పాలి. కోహ్లీ ఆటతీరుతో గత కొంత కాలం నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడు టీమిండియా విజయంలో కీలకపాత్ర వహించేకోహ్లీ ఇప్పుడు మాత్రం తన పేలవమైన ఫామ్ తో టీమిండియాలో ఓటమికి కారణం అవుతున్నాడు అనే చెప్పాలి. ఇటీవలే సౌత్ ఆఫ్రికా లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కోహ్లీ 70కి పైగా పరుగులు చేయడంతో మళ్ళీ మునుపటి ఫామ్ లోకి  వచ్చాడు అని అందరూ అనుకున్నారు. కాని రెండవ వన్డే మ్యాచ్ లో మాత్రం తీవ్ర నిరాశ పరిచాడు. ఒక్క పరుగు కూడా చేయకుండానే గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. దీంతో విరాట్ కోహ్లీ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: