ఐపీఎల్ సందడి మొదలు కాబోతుంది. ఫిబ్రవరిలో మెగా వేలం నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ లోకి రెండు కొత్త జట్లు కూడా ఎంట్రీ ఇస్తూ ఉండడం గమనార్హం  కొత్త జట్లు ఎంట్రీ ఇస్తున్నాయి అని ఒక వైపు ప్రేక్షకులందరూ అంచనాలు పెట్టుకున్నారు. అదే సమయంలో మెగా వేలంలో ఏ ఆటగాడు ఏ జట్టు లోకి వెళ్ళపోతున్నాడు అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక మునుపటి సీజన్ లతో పోల్చి చూస్తే ఈసారి ఐపీఎల్ మాత్రం ఊహకందని రీతిలో అదిరిపోయే క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పంచడం పక్క అని ప్రేక్షకులందరూ బలంగా నమ్ముతున్నారు అనే చెప్పాలి. అయితే ప్రతి సీజన్లో ఐపీఎల్ లో భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఎంతో కీలకం గా మారిపోతూ ఉంటారు. ప్రతి మ్యాచ్లో కూడా విదేశీ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడటానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఒకవైపు భారీగా ఆదాయం వస్తూ ఉండటం మరోవైపు అనుభవం కూడా వస్తుండడంతో విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో కి రావడానికి ఆసక్తి చూపుతారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్కు దూరంగా ఉంటూ ఉండటం గమనార్హం. ఇలా ప్రస్తుతం ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు ను ఈసారి ఐపీఎల్ లో ఫాన్స్ అందరు మిస్ కాబోతున్నారూ అన్నది తెలుస్తుంది. ఇందులో ఒకరు క్రిస్ గేల్ టి20 స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా ఉన్న క్రిస్ గేల్ ఐపీఎల్లో సృష్టించిన విధ్వంసం గురించి ఎప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేరు. ఎప్పుడూ సిక్సర్ల మోత మోగిస్తూ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు క్రిస్ గేల్. కాగా క్రిస్ గేల్ ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. ఇక మరొక దిగ్గజ ప్లేయర్ ఎబి డివిలియర్స్. ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కొనసాగిన ఈ ఆటగాడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అద్భుతమైన షాట్లతో  వినోదాన్ని పంచుతూ వచ్చాడు.  కానీ ఇటీవల మాత్రం వేలానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. దీంతో ఈ సీజన్లో ప్రేక్షకులు ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను మిస్ అయ్యే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: