గత కొంత కాలం నుంచి భారత క్రికెట్లో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా ఎంత అద్భుతంగా రాణిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఫార్మాట్ తో పనిలేకుండా ప్రతి ఫార్మాట్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే గత కొంత కాలం నుంచి రవీంద్ర జడేజా ఎంతో అద్భుతమైన రికార్డులను కొల్లగొడుతున్నాడు అనే విషయం తెలిసిందే. అంతేకాదు ఇక గత కొంత కాలం నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటిస్తున్న ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా ఆల్రౌండర్ల జాబితాలో టాప్ ప్లేస్ లో కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.


 ఇప్పుడు మరోసారి టాప్ ప్లేస్లో కొనసాగాడు రవీంద్ర జడేజా. దీంతో అభిమానులు అందరూ కూడా ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు. ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ ని ప్రకటించింది. ఇక ఈ ర్యాంకింగ్స్ లో 385 పాయింట్లతో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మొదటి స్థానంలో నిలిచాడు. ఇక రెండవ స్థానంలో వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ 357 పాయింట్లతో ఉన్నాడు అన్న విషయం తెలుస్తుంది. ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్లో విశేషంగా రాణించిన రవీంద్ర జడేజా ఇక ఇలా నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది.


 అయితే ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచిన రవీంద్ర జడేజా రెండవ స్థానంలో నిలిచిన జాసన్ హోల్డర్ మధ్య దాదాపు 28 పాయింట్ ల వ్యత్యాసం ఉండటం గమనార్హం. మరో రెండు నెలల పాటు ఎలాంటి టెస్ట్ సిరీస్ లేకపోవడంతో ఇక రవీంద్ర జడేజా కొన్నాళ్లపాటు అగ్రస్థానంలోనే ఉండే అవకాశం ఉంది. ఇకపోతే మూడవ స్థానంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 344 పాయింట్లతో కొనసాగుతున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజాం ఆస్ట్రేలియా సిరీస్ లో విశేషంగా ఆకట్టుకుని మూడు స్థానాలు ఎగబాకి టాప్-5లో చోటు సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: