మరో గంటలో ఐపిఎల్ సీజన్ 15 ఘనంగా ఆరంభం కానుంది. అయితే కరోనాకు ముందు వరకు ప్రతి సంవత్సరం ఐపిఎల్ ను ప్రారంభోత్సవాలు జరిపేవారు. కానీ కరోనా పుణ్యమా అని అది దానికి ఫుల్ స్టాప్ పడింది. దీనితో ఈ రోజు డైరెక్ట్ గా 7.30 గంటలకు ముంబై లోని వాంఖడే స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్యన మొదటి టీ 20 మ్యాచ్ జరగనుంది. ఇది నిజంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐపిఎల్ అభిమానులకు సంతోసన్నినిచే విషయం. ఈ మ్యాచ్ తో రెండు జట్లకు కొత్త కెప్టెన్ కు సారథ్య బాధ్యతలు తీసుకోనున్నారు.

కోల్కతా ఎన్నో ఆశలతో శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ గా ఎంచుకుంది. ఇక చెన్నై కి కెప్టెన్ గా ఉన్న ఎమ్మెస్ ధోనీ రెండు రోజుల క్రితం కెప్టెన్సీ నుండి శాశ్వతంగా తొలగిపోవడంతో జడేజాకు ఆ అవకాశం దక్కింది. ఇదిలా ఉంటే ఈ రోజు మ్యాచ్ జరగబోయే స్టేడియం గతంలో ఆడిన మ్యాచ్ లను బట్టి చూస్తే చెన్నైకు అనుకూలంగా ఉంది. ఈ స్టేడియం లో గత సీజన్ లో చెన్నై 5 మ్యాచ్ లు ఆడితే, వాటిలో 4 మ్యాచ్ లలో గెలిచి మంచి రికార్డును కలిగి ఉంది. అదే విధముగా కోల్కతా టీమ్ కు ఇక్కడ ఉన్న రికార్డును పరిశీలిస్తే, కేకేఆర్ ఇక్కడ మొత్తం 11 మ్యాచ్ లు ఆడగా 10 మ్యాచ్ లలో ఓటమి పాలయింది. దీనితో ఒత్తిడి మొత్తం కోల్కతా మీదనే ఉండనుంది.

కానీ కొత్త కెప్టెన్ తో ఫ్రెష్ గా ఆడి చెన్నై కు షాక్ ఇస్తుందా? లేదా ఈ గ్రౌండ్ లో ఉన్న చెత్త రికార్డును కొనసాగిస్తుందా అన్నది తెలియాలంటే ఇంకాస్తసేపు ఆగాల్సిందే. అయితే ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపుతుంది అని తెలుస్తోంది. మరి ఏమి జరగనుంది అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: