గతంలో ఐటెం సాంగ్ లతో అదరగోట్టిన అనసూయ ఇక ఇప్పుడు ఏకంగా సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తూ అదరగోడుతుంది. దర్శక నిర్మాతలు అందరికీ కూడా వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అనసూయ. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా రంగమత్త గా నటించిన అనసూయ మొన్నటికి మొన్న పుష్ప సినిమాలో దాక్షయని అనే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఏ పాత్రలో నటించిన తనకు తానే సాటి అని నిరూపించింది.
అయితే జబర్దస్త్ యాంకర్ అనసూయ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. పెళ్లయి పిల్లలు ఉన్నప్పుడు పొట్టి పొట్టి దుస్తులు వేసుకోవడం ఏంటి ఎంతో మంది కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇలా చేసిన వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే సీతారాముల కళ్యాణం చూతము రారండి ఈవెంట్ ప్రోమో లో భాగంగా తన భర్త గురించి ఎంతో గొప్పగా చెప్పింది. మీ భర్త గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అంటే.. నేను ప్రతిరోజు నా భర్త తో ప్రేమలో పడుతూనే ఉంటాను.. ఇక నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల ఇక్కడ ఉన్నాను. భరద్వాజ లాంటి భర్త ప్రతి ప్రతి ఆడపిల్లకు ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు అంటూ అనసూయ తన భర్త గురించి గొప్పగా చెప్పింది. తర్వాత ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి