ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయింది అంటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా  అసలు సిసలైన క్రికెట్ మజా ఉంటుంది. అయితే ఫిబ్రవరిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించి జరిగిన మెగా వేలం నాటి నుంచి ప్రేక్షకుల అంచనాలను తారుమారు అవుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్లేయర్స్ కి మెగా వేలంలో భారీ డిమాండ్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అన్ని ఫ్రాంచైజీలు యువ ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై కోట్లు వెచ్చించాయ్. పెద్ద స్టార్ ప్లేయర్స్ అన్ సోల్డ్ గా మిగిలిపోయారు.


 ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత కూడా ప్రేక్షకుల అంచనాలు తారుమారు అవుతున్నాయ్. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్స్ ఆడటానికి తడబడుతూ ఉంటే.. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్థానం మొదలు పెడుతున్న యువ ఆటగాళ్లు మాత్రం తమ ప్రతిభను చాటి అదరగొడుతున్నారు. యువ బ్యాట్స్మెన్లు సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతున్నారు. అనుభవం లేకపోయినా ఎక్కడ ఒత్తిడి మాత్రం వారిలో కనిపించడం లేదనే చెప్పాలి. ఇటీవలే ముంబై ఇండియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఒకభారీ సిక్సర్ నమోదయింది.


 బేబీ ఏబీ డివిలియర్స్ గా గుర్తింపు పొందాడు ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ బ్రేబీస్. ఇక మైదానంలో 360 డిగ్రీస్ లో కూడా మంచి షాట్లు ఆడగల టాలెంట్ అతని సొంతం అని చెప్పాలి. పద్దెనిమిదేళ్ల కుర్రాడు ఇటీవలే మ్యాచ్లో అదరగొట్టాడు. రాహుల్ చాహర్ ఓవర్లో విధ్వంసం సూచించాడు. ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు ఒక ఫోర్ కొట్టి 28 పరుగులు చేసాడు. ఇక ఇందులో ఒక భారీ సిక్సర్ ఉండటం గమనార్హం. బ్రేబీస్ కొట్టిన సిక్సర్ లలో ఒక సిక్స్ ఏకంగా 112 మీటర్లు వెళ్ళింది. దీంతో ఐపీఎల్ సీజన్ లో అత్యంత బిగ్గెస్ట్ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా అతను అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: