ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మంత్లీ ర్యాంకింగ్స్  పాటు అటు వీక్లీ ర్యాంకింగ్స్ కూడా అప్పుడప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఐసీసీ విడుదల చేసిన వీక్లీ ర్యాంకింగ్స్ లో భారత్ ఎంతగానో  కె.ఎల్.రాహుల్ మెరుగైన ర్యాంకు సాధించాడు. టాప్ టెన్ బ్యాట్స్మెన్ జాబితాలో కి ప్రవేశించాడు కె.ఎల్.రాహుల్. అంతేకాదు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక భారతీయుడుగా కూడా కె.ఎల్.రాహుల్ అటు భారత క్రికెట్ పరువు నిలబెట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టి20 ఫార్మాట్ వీక్లీ ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది. ఇక ఇందులో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్  షాహీన్ అఫ్రిది నాలుగు స్థానాలు ఎగబాకి పదవ స్థానంలో చోటు దక్కించుకోవడం గమనార్హం.


 పాకిస్తాన్ బ్యాట్స్మెన్లలో కెప్టెన్ బాబర్ అజాం ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అతని సహచరుడు అయిన మొహమ్మద్ రిజ్వాన్ ఒక స్థానం కోల్పోయి ప్రస్తుతం మూడవ స్థానానికి దిగజారిపోయాడూ. ఇక భారత బ్యాట్స్మెన్లు ఎవరు కూడా టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడం గమనార్హం. కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 16వ స్థానంలో ఉండడం గమనార్హం. గత కొంత కాలం నుంచి ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్ లో మాత్రం అంతకంతకూ దిగజారిపోతు ఉన్నాడు.  అయితే అటు కె.ఎల్.రాహుల్ మాత్రం 649 పాయింట్లతో టాప్ టెన్లో నిలిచాడు.


 ఇక టెస్ట్ ర్యాంకింగ్స్ లో పెద్దగా మార్పులేమీ జరగలేదు అని చెప్పాలి. ఆల్ రౌండర్  జాబితాలో భారత్కు చెందిన రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక బౌలర్ల టెస్టు ర్యాంకింగ్స్ లో అశ్విన్ జస్ప్రిత్ బూమ్రా వరుసగా రెండు స్థానాల్లో ఉండటం గమనార్హం. ఇక టెస్టు ర్యాంకింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ 8వ స్థానంలో ఉన్నారు ఏది ఏమైనా టి20 ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. రాహుల్ ఒక్కడే టాప్ టెన్ లో ఉండడంతో ఇక భారత పరువు నిలబెట్టాడు అంటూ కొంతమంది అభిమానులు అనుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: