2008 సంవత్సరంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఇక ఇప్పుడు 15వ సీజన్ నడుస్తుంది. అయితే ప్రతి సీజన్లో కూడా అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది.  ప్రస్తుతం ప్రపంచంలోని రిచెస్ట్ లీగ్ గా కొనసాగుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇక ప్రతి ఏడాది ఐపీఎల్లో వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. అదే సమయంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి తమ ప్రతిభను నిరూపించుకుని అంతర్ జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటూ ఉండటం గమనార్హం. ఇక మరోవైపు అటు సీనియర్లు కూడా ఐపీఎల్లో అదరగొడుతు ఎన్నో అద్భుతమైన రికార్డులను కొల్లగొడుతున్నారు.


 అయితే ఐపీఎల్ ప్రారంభమైన సమయంలో భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతుంది సచిన్ టెండూల్కర్ అటు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ముంబై ఇండియన్స్ జట్టును ఐపీఎల్ ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు సచిన్ టెండూల్కర్. అయితే ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఎన్నో అద్భుతమైన రికార్డు సృష్టించిన సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ లో కూడా పలు రికార్డులను తన పేరున లిఖించుకున్నాడు.  అయితే ప్రస్తుతం ఎంతో మంది యువ ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తు అరుదైన రికార్డు సాధించడం లాంటివి చేస్తూ ఉన్నారు.  కానీ ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండి పోయింది అని చెప్పాలి.


 ఇండియన్ ప్రీమియర్ అతి తక్కువ ఇన్నింగ్స్ లోనే 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. కేవలం 31 ఇన్నింగ్స్ లో మాత్రమే సచిన్ టెండూల్కర్ ఇలా 1000 పరుగుల మైలురాయిని అందుకోవడం గమనార్హం. అయితే 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇక ఇప్పుడు 15 సీజన్ నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రికార్డు అలాగే ఉంది. సచిన్ టెండుల్కర్ తర్వాత సురేష్ రైనా 34 ఇన్నింగ్సులో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తర్వాత రిషబ్ పంత్ 35 ఇన్నింగ్సులో ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక ఆ తర్వాత గౌతం గంభీర్ 36 ఇన్నింగ్స్ లో 1000 పరుగులు సాధించడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: