వరుస విజయాలతో జోరుమీద టైటాన్స్ కు వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్రేకు వేసింది అన్న విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సైతం ఓటమి చవిచూసింది. దీంతో అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. దిగ్గజ జట్లను ఓడించిన గుజరాత్ చివరికి సన్రైజర్స్ చేతిలో ఓడిపోయింది ఏంటి అని ఆశ్చర్యపోయారు. అయితే అచ్చంగా ఇలాగే 2016 ఐపీఎల్ కూడా ఇలాంటి కోఇన్సిడెన్స్ జరిగింది.
2016 ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ లయన్స్ ఆడిన తొలి మూడు మ్యాచ్ లలో కూడా తిరుగు లేదు అనే విధంగానే సూపర్ విజయాన్ని సాధించింది. కానీ నాలుగో మ్యాచ్ లో మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్ జట్టు వరుసగా మూడు మ్యాచ్ లలో గెలిచింది. నాలుగో మ్యాచ్ లో మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతిలో ఓడిపోయింది అని చెప్పాలి. విచిత్రంగా రెండు జట్లు ఐదు మ్యాచ్లలో గెలిచాయి. 2016 సీజన్ లో గుజరాత్ లయన్ జట్టు ఫైనల్ వరకు వెళ్ళింది. ఇది తెలిసిన తర్వాత వాటే కోఇన్సిడెన్స్ అని అనుకుంటున్నారు అందరు .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి