ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ఎంత పేలవా ప్రస్థానం కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ లలో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది ముంబై ఇండియన్స్ జట్టు.  ఒకప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగిన జట్టు ఈసారి మాత్రం పేలవ ప్రదర్శన చేస్తోంది. అయితే ముంబై ఇండియన్స్ లో కీలక ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, పోలార్డ్ లాంటి వారు ఎవరు సరిగ్గా రాణించడం లేదు. బౌలింగ్ లో కూడా జస్ప్రిత్ బూమ్రా ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు.


 ముఖ్యంగా ముంబై ఇండియన్స్ లో సీనియర్ గా కొనసాగుతున్న కీరన్ పొలార్డ్ ఫామ్ పై ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతోంది. 6 కోట్లు పెట్టి అతని రిటైన్ చేసుకుంది ముంబై యాజమాన్యం. అయితే ఇప్పటి వరకు 10 మ్యాచ్ లలో ఆడిన పోలార్డ్ ఏకంగా 129 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధికం 25 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. ఈ గణాంకాలు చూస్తే అతని ప్రదర్శన ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా 14 బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు.


 ఈ నేపథ్యంలోనే ఇటీవలే పోలార్డ్ ఫామ్ గురించి టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చొప్రా  కీలక వ్యాఖ్యలు చేశాడు. మిగిలి ఉన్న మ్యాచులలో కిరణ్ పోలార్డ్ పై వేటు తప్పదు అని అభిప్రాయం వ్యక్తం చేశాడూ. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ పోలార్డ్ కీ ఈ సీజన్లో చివరిది కావచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. నాకు తెలిసి కీరన్ పొలార్డ్ వచ్చే ఏడాది నుంచి ఆడకపోవచ్చు. డెవల్ట్ బ్రెవిస్ ఉన్నాడు.  అంతేకాకుండా టీమ్ డేవిడ్ రాణిస్తున్నాడు. కాబట్టి పోలార్డ్ ని ఆదించచకపోవచ్చు. నిజానికి డెవల్ట్ బ్రెవిస్ ను ఎందుకు జట్టులోకి తీసుకురాలేదో తెలియడం లేదు. సిక్సర్లు కొట్టి హిట్టింగ్ మెషిన్ ను ముంబై వాళ్ళు పక్కన పెట్టారు అంటూ ఆకాష్ చొప్రా చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl