దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించడం పక్క అని అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ క్రమంలోనే నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. దీంతో భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఓపెనింగ్ లోనే ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్లు ఇద్దరు కూడా తక్కువ పరుగులకే వికెట్లు కోల్పోయారు. ఈ క్రమంలోనే క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి, 58 పరుగులు మార్కరం 21 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది సన్రైజర్స్.
దీంతో చివరికి 67 పరుగుల తేడాతో విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇక అటు వరుసగా మూడో ఓటమి సాధించి హ్యాట్రిక్ కొట్టింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోవడం లో అటు బెంగుళూరు స్పిన్నర్ హాసరంగా కీలకపాత్ర వహించాడు అనే చెప్పాలి. ఏకంగా కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఏకంగా సన్రైజర్స్ బ్యాట్స్మెన్లను తక్కువ పరుగులకే కట్టడి చేయడమే కాదు ఏకంగా 5 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఇలా సన్ రైజర్స్ ఆడిన మ్యాచ్లో ఈ శ్రీలంక ప్లేయర్ విలన్ గా మారిపోయాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి