ఐపీఎల్ పోరు ప్రస్తుతం ఎంతో రసవత్తరంగా మారిపోయింది. ఎంతలా అంటే ఒక జట్టు భవిష్యత్తు ఆ జట్టు విజయం పై నే కాదు మిగతా జట్ల ఓటమి పైన కూడా ఆధారపడి ఉంది. ప్రస్తుతం ప్లే ఆఫ్ లో అవకాశాలు దక్కించుకోవాలి అంటే కొన్ని జట్లకు తమ గెలుపు తో పాటు ఇతర జట్ల ఓటమి కూడా తప్పనిసరిగా కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా మరింత ఉత్కంఠభరితంగా జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్లే ఆఫ్లో గుజరాత్, లక్నో జట్లు అడుగు పెట్టాయి. మిగతా రెండు స్థానాలలో ఏ జట్లు నిలుస్తాయ్ అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక మిగిలిన రెండు స్థానాల్లో చోటు దక్కించుకోవడం కోసం ప్రతి జట్టు హోరాహోరీగా పోటీపడుతోంది. గెలుపే లక్ష్యంగా కసిగా కనిపిస్తూ ఉంది. దీంతో ఉత్కంఠభరితంగా జరిగే మ్యాచ్ వీక్షించేందుకు ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలె గుజరాత్ టైటాన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో  బెంగళూరు జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ క్రమంలోనే 19 ఓవర్లు కూడా ముగియకముందే అటు గుజరాత్ తమ ముందు ఉంచిన టార్గెట్ చేదించి విజయాన్ని సాధించింది బెంగుళూరు.


 ఈ క్రమంలోనే ప్లే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది అని చెప్పాలి. అయితే ఇక గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించడంతో ఆర్ సి బి ప్లేయర్ అవకాశాలు సజీవంగా ఉంటే ఈ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి హైదరాబాద్,పంజాబ్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్ పోటీ నుంచి తప్పుకున్నాయ్. ఇక ఈ రెండు జట్లు కూడా మే 22వ తేదీన నామమాత్రం అయినా తమ చివరి మ్యాచ్ ఆడ పోతున్నాయ్ అన్నది తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసి ఈ రెండు జట్ల అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోతున్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl