ఈ ఏడాది ఎంతో పటిష్టంగా కనిపించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది.  తర్వాత మాత్రం కొన్ని మ్యాచ్లో ఓటమి తో వెనుకబడినట్లు కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం అనూహ్యంగా పుంజుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఈ సీజన్లో తన ప్రస్థానాన్ని రెండవ స్థానంతో ముగించింది అని చెప్పాలి. ఇక ప్లే ఆఫ్ లో స్థానం దక్కించుకున్న మూడవ జట్టుగా రాజస్థాన్ రికార్డ్ సృష్టించింది. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.4 ఓవర్లలో టార్గెట్ చేధించింది.


 ఇక రాజస్థాన్ విజయంలో అటు రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర వహించాడు. 23 బంతుల్లో 46 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు బౌలింగులో నాలుగు ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీశాడు. తనలో ఉన్న  ఆల్ రౌండ్ ని మరోసారి బయట పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. చివరికి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నారు రవిచంద్రన్ అశ్విన్. తన ప్రదర్శనపై మాట్లాడిన అశ్విని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  కీలక సమయంలో బ్యాట్ తో రాణించడంతో సంతోషంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు.


 ఒత్తిడిలో ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టమే అంటూ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ఎందుకంటే అలాంటి సమయమే మనలో ఉన్న ప్రతిభను బయటపడుతూ ఉంటుంది. యశస్వి జైస్వాల్ మంచి పునాది వేస్తే దానిని నేను కంటిన్యూ చేసాను అంటూ తెలిపాడు. ప్లే ఆఫ్ లో కూడా మంచి ప్రదర్శన చేసి ఫైనల్కు చేరుకుంటాం.. రాసిపెట్టుకోండి ఈసారి కచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కప్పు కొట్టి తీరుతుంది అంటూ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. కాగా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలిఫైయర్ వన్ లో గుజరాత్ తో తలపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl