సాధారణంగా భారత్ పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల క్రికెట్ జట్ల తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడుతూ ఉంటుంది. కానీ అటు పాకిస్థాన్తో మాత్రం క్రికెట్ సంబంధాల పై నిషేధం విధించిన నేపథ్యంలో కేవలం వరల్డ్ కప్ లో తప్ప మిగతా ద్వైపాక్షిక సిరీస్లు అస్సలు ఆడదు  అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న క్రికెట్ నిషేధం నేపథ్యంలో ప్రేక్షకులు కూడా ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ అంటే చాలు  ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు.


 ఇక ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు ఆడుతున్నప్పుడు కేవలం రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా మ్యాచ్ వీక్షించడం చేస్తూ ఉంటారు. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోందంటే చాలు అది హై వోల్టేజీ మ్యాచ్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఇటీవలే భారత టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పుజారా పాకిస్థాన్ బ్యాట్స్మెన్ మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరు కూడా ఇంగ్లాండ్ కౌంటి లలో ఒకే జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు


 ఇంగ్లాండ్ కౌంటి ల్లో ససెక్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఆటగాళ్ళు అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మొహమ్మద్ రిజ్వాన్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాకిస్తాన్ ఆటగాళ్ళు పరస్పర క్రికెట్ ఆడాలి అని అనుకుంటున్నా అంటూ వ్యాఖ్యానించాడు. దౌత్య  పరమైన విషయాలు క్రికెటర్ల చేతుల్లో లేవు అంటూ తెలిపాడు. జట్టు తరఫున తనతో కలిసి ఆడిన భారత బ్యాట్స్మెన్ చటేశ్వర్ నుండి విషయాలను నేర్చుకున్నాను అంటూ మహమ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు అతని బ్యాటింగ్ ఎక్కువగా ఆరాధిస్తానని ఒక్కసారి అతను ఏకాగ్రతతో కుదురుకున్నాడంటే అతని ఆపడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: