సొంతగడ్డపై దుమ్ము దులుపుతుంది అనుకున్న టీమిండియాకు  చేదు అనుభవం ఎదురైంది అనే విషయం తెలిసిందే. భారత పర్యటనలో ఉన్న సౌత్ ఆఫ్రికా పై పూర్తి ఆధిపత్యం సాధిస్తుందని క్లీన్ స్వీప్ చేసి ప్రతీకారం తీర్చుకుంటుంది అని అందరూ అనుకున్నారూ. కానీ టీమిండియా ప్రదర్శనతో అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. సొంత గడ్డపై ఇరగదీస్తుంది అనుకున్న టీమిండియా డీలా పడిపోయింది.


 ఒక మ్యాచ్ ఓడిపోయిన ఇండియా ఇక తర్వాత మ్యాచ్ లో అయినా పుంజుకుంటుందని అందరూ అనుకున్నారు. అంచనాలను అందుకోవడం కాదు కదా సరిగ్గా బ్యాటింగ్ చేయలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే అటు టీమ్ ఇండియా వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో సౌత్ ఆఫ్రికా మరో మ్యాచ్ గెలిచింది అంటే చాలు ఇక సీరిస్ ఎగరేసుకు పోతుంది. ఈ క్రమంలోనే టీమిండియా ప్రదర్శనపై ఇటీవలే మాజీ ఆటగాళ్లు జహీర్ ఖాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 కాశ్మీర్ స్పీడ్ గన్ గా పేరు సంపాదించుకున్న ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయం  వ్యక్తం చేశాడు. అతడు జట్టులో ఉంటే కీలక టర్నింగ్ పాయింట్ కీ కారణం అవుతాడు  అని చెప్పుకొచ్చాడు. ఒక క్రీడా ఛానల్ తో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఐపీఎల్ ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శన మనమంతా చూశామూ.. దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ మిల్లర్ ను ఔట్ చేసిన విధానం అమోఘం. తన వేగవంతమైన బంతితో బ్యాట్స్మెన్ లను బోల్తా కొట్టిస్తాడు. అందుకే అతను భారత జట్టు లో చేరితే తప్పకుండా ప్రభావం చూపుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.  మరి మూడవ టీ20 మ్యాచ్ లో అయినా ఉమ్రాన్ మాలిక్ కు  జట్టులో స్థానం కల్పిస్తారా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: