ఇటీవల సౌత్ ఆఫ్రికా భారత పర్యటన నేపథ్యంలో టి 20 జట్టుకు కెప్టెన్సీ చేపట్టిన రిషబ్ పంత్  గురించి గత కొంత కాలం నుంచి చర్చ జరుగుతోంది. రిషబ్ పంత్ బ్యాటింగ్ తో  తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్సీలో  పర్వాలేదు అనిపించినప్పటికీ బ్యాట్మెన్గా మాత్రం పూర్తిగా విఫలం అవుతున్నాడు అని చెప్పాలి. టీమ్ ఇండియా సౌత్ఆఫ్రికా తో ఆడిన నాలుగు టి20 మ్యాచ్ లలో కలిపి కేవలం 57 పరుగులు మాత్రమే చేశాడు రిషబ్ పంత్.


 ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో అతనికి టీమిండియాలో చోటు దొరకడం కష్టమే అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దినేష్ కార్తీక్ అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్న నేపథ్యంలో రిషబ్ పంత్ కి రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి అంటూ చెబుతున్నారు. ఇక వరల్డ్ కప్ జట్టులోకి కూడా రిషబ్ పంత్ చోటు దొరుకుతుంది అన్నది అనుమానమే అంటూ మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఉండటం గమనార్హం. ఇటీవల ఇదే విషయంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు.


 ఈ క్రమంలోనే పేలవమైన ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్ కు  మద్దతుగా నిలిచాడు రాహుల్ ద్రావిడ్. రాబోయే కొన్ని నెలల వరకు టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో రిషబ్ పంత్ అంతర్భాగమే అంటూ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. దూకుడుగా ఆడే క్రమంలో సౌత్ఆఫ్రికా సిరీస్ లో రిషబ్ పంత్ విఫలమయ్యాడు. కానీ ఇతను మధ్య ఓవర్లలో మాకు కీలకమైన ఆటగాడు. అలాగే ఈ ఒక్క సిరీస్ తోనే అతడి కెప్టెన్సీని అంచనా వేయలేము. 2-2 తో సిరీస్ సమం చేయడం మంచి విషయం.  ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని దినేష్ కార్తీక్ సద్వినియోగం చేసుకున్నాడు అంటూ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: