భారత మహిళా క్రికెట్ కు ప్రత్యేకమైన వన్నెతెచ్చిన క్రికెటర్గా అటు మిథాలీ రాజ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత మహిళా క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించిన మిథాలి రాజ్ జట్టులో ఒక ప్లేయర్గా.. కెప్టెన్గా అటు టీమిండియాకు మరుపురాని విజయాలను  అందించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాకుండా టీమిండియా మహిళా క్రికెట్లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది మిథాలీ రాజ్.  భారత మహిళల జట్టు తరఫున 6 ప్రపంచ కప్ లు ఆడింది కూడా మిథాలీ రాజ్ మాత్రమే కావడం గమనార్హం.


 ఇటీవలే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా మహిళా క్రికెట్ కు ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టి అగ్ర స్థానంలో నిలిపిన మిథాలీ  రిటైర్మెంట్ ఎంతో మందిని భావోద్వేగానికి గురి చేసింది అని చెప్పాలి. అయితే మిథాలీ రాజ్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన 16 రోజుల వ్యవధిలోనే ఆమె రికార్డు బద్దలు కావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఐదు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును ఓడించింది.  2-0 తేడాతో  ఆధిక్యం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.


 ఈ మ్యాచ్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 31 పరుగులతో రాణించింది. ఈ క్రమంలోనే మిథాలీరాజ్ రికార్డును బద్దలు కొట్టింది హర్మన్ ప్రీత్ కౌర్. ఇంటర్నేషనల్ టీ20 లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. హర్మాన్ ప్రీత్ కౌర్ ఇప్పటి వరకు 123 మ్యాచ్లలో 27 సగటుతో 2372 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ 6  హాఫ్ సెంచరీలు ఉండటం గమనార్హం. కాగా అటు భారత మహిళ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 89 ఇన్నింగ్స్ లో  38 సగటుతో 2364 పరుగులు చేయడం గమనార్హం. ఇందులో 17 అర్థసెంచరీలు ఉండగా ఇక మిథాలీరాజ్ అత్యధిక స్కోరు 97 పరుగుల కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: