మొన్నటి వరకు పేలవమైన ఫామ్ తో ఇబ్బందిపడిన రిషబ్ పంత్ ఇక ఇటీవల కాలంలో అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే..  ఇక ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా టెస్టు మ్యాచ్ లో ఆడుతున్న రిషబ్ పంత్ ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో తన సూపర్ సెంచరీతో ఆదుకున్నాడు. ఏకంగా 111 బంతుల్లోనే 146 పరుగులు చేసి టి20 తరహాలో బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు అని చెప్పాలి. ఇక రిషబ్ పంత్ అద్భుతమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అందరూ కూడా అతని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సైతం రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.


 భారత యువ ఆటగాడు రిషబ్ పంత్ ను వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాతో పోల్చాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్. ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడుతూ రిషబ్ పంత్ ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు. ప్రస్తుతం ఉన్న వికెట్-కీపర్ లలో రిషబ్ పంత్ బ్రియాన్ లారా లాంటివాడు. అప్పుడు మ్యాచ్ బర్మింగ్హామ్లో జరుగుతుంది. అక్కడ బ్రియాన్ లారా వార్విక్ షేర్ జట్టు తో ఆడినప్పుడు 501 పరుగులు చేశాడు. ఇక ఇటీవలే రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బ్రియాన్ లారా ఆడే  షాట్లు పలుచోట్ల కూడా కనిపించాయి.


 రిషబ్ పంత్ తన ఇన్నింగ్స్ లో బంతి తన వద్దకు వచ్చేంతవరకు కూడా వేచి చూసి మంచి షాట్లు ఆడాడు. ఫాస్ట్ బౌలర్లపై మిడ్ వికెట్ మీదుగా అతను ఆడిన రెండు మూడు షాట్లు అద్భుతంగా అనిపించాయి. అయితే రిషబ్ పంత్ ఒత్తిడికి గురి చేసేందుకు ఒక గల్లీ ఫీల్డర్ తో సహా స్లిప్ లో ఫీల్డర్లను కూడా పెట్టింది ఇంగ్లాండ్ జట్టు. కానీ అతడు మాత్రం పరుగులు చేసేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అద్భుతంగా రాణించాడు అంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ప్రశంసలు కురిపించాడు అని చెప్పాలి. అయితే  మొదటి ఇన్నింగ్స్ లో 146 పరుగులకే అదరగొట్టినా పంత్ రెండో ఇన్నింగ్స్ లో ఎలా రాణిస్తాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: