గత కొంత కాలం నుంచి టీమిండియా వరుస పర్యటనలతో బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న ఇండియా ఇక ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ముందుగా క్రికెట్ విశ్లేషకుల అంచనా వేసిన ప్రకారమే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 ఆధిక్యంతో సిరీస్ కైవసం చేసుకుంది అనే చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక మూడవ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా జరుగుతుందని ప్రతి ఒక్కరు భావించారు. అందరూ ఊహించినట్లుగానే చివరి మ్యాచ్ నువ్వానేనా అన్నట్టుగా జరిగింది.



 మొదటి రెండు మ్యాచ్లలో తక్కువ పరుగులకే ఆలౌటైన జింబాబ్వే జట్టు మూడో మ్యాచ్లో మాత్రం  భారత తమ ముందు ఉంచిన భారీ టార్గెట్ ను ఊహించని రీతిలో చేదించేలా కనిపించింది. కానీ చివర్లో తడబడటంతో ఇక 13 పరుగుల తేడాతో  జింబాబ్వే జట్టు పరాజయం పాలైంది అని చెప్పాలి. ఇకపోతే జింబాబ్వే 3- 0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. ఇలాంటి సమయంలోనే యువ ఆటగాడు శుభమాన్ గిల్ కీలకమైన సెంచరీ చేసి అదరగొట్టాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు రికార్డులను బ్రేక్ చేశాడు. గత కొంతకాలం నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న శుభమాన్ గిల్  మొదటి వన్డే సెంచరీ సాధించి భారత క్రికెట్ లో ఒక అరుదైన రికార్డును సృష్టించాడు.


 అతి పిన్న వయసులో వన్డే ఫార్మాట్ లో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ తొలి సెంచరీ 23 ఏళ్ల 28 రోజుల వయసులో చేయగా ఇప్పుడు శుభమాన్ గిల్ తన తొలి సెంచరీ 22 ఏళ్ళ 348 రోజులకు అందుకున్నాడు. ఇక అంతే కాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు శుభమాన్ గిల్. జింబాబ్వేపై   అత్యధిక స్కోరు 136 బంతుల్లో 127 పరుగులు. అయితే శుభమాన్ గిల్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్ తో 97 బంతుల్లోనే 130 పరుగులు చేసి అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: