ఈనెల 27వ తేదీ నుంచి మిని ప్రపంచ కప్ గా పిలువబడే ఆసియా కప్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఆసియా కప్లో భాగంగా ఇక టీమ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి ప్రేక్షకులందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఆసియా కప్లో రెండో మ్యాచ్లో భాగంగా దాయాదుల సమరం జరగబోతుంది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆసియా కప్ విజేతగా నిలవాలని భావిస్తోంది టీమ్ ఇండియా జట్టు. ఇలాంటి సమయంలోనే పక్కా ప్రణాళికతో ఆసియా కప్ లో బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతుంది. కానీ గత కొంతకాలం నుంచి మాత్రం టీమిండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఇప్పటికే జట్టులో కీలక బౌలర్లు గా కొనసాగుతున్న జస్ప్రిత్ బూమ్రా హర్షల్ పటేల్ జట్టుకు దూరమయ్యారూ. ఈ క్రమంలోనే  భువనేశ్వరి నేతృత్వంలోనే ఆసియా కప్లో బౌలింగ్ విభాగం ఎటాక్ చేయబోతోంది. ఇక ఇప్పుడు టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. తన కోచింగ్ తో టీమ్ ను ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న రాహుల్ ద్రవిడ్ కరోనా వైరస్ బారిన పడ్డాడు అనేది తెలుస్తుంది. దీంతో నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా కొనసాగుతున్న వీవీఎస్ లక్ష్మణ్ ఇక ఆసియా కప్ లో టీమిండియాకు కోచ్గా వ్యవహరించ పోతున్నారట.



 ఇక దీనిపై అటు బీసీ అధికారికంగా నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది. ఆసియా కప్ పూర్తి అయ్యేంత వరకూ కూడా అటు  లక్ష్మణ్ టీమిండియాకు హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టబోతున్నారట. కరోనా వైరస్ బారిన పడిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ఆయన కోలుకున్న తర్వాత తిరిగి జట్టుతో చేరుతారని బిసిసిఐ పేర్కొంది. అయితే ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వివిఎస్ లక్ష్మణ్ ఇటీవల జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీం ఇండియాకు కోచ్గా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: