మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ దిగుతూ సిక్సర్లతో చెలరేగి పోతు ఉంటాడు హార్దిక్ పాండ్య. ఇదివరకు కొన్నాళ్లపాటు జట్టుకు దూరమైన హార్థిక్ ఇటీవలే మళ్లీ ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు. ఇక ఇటీవల పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో మరోసారి నికార్సైన ఆల్ రౌండర్ అన్న మాటకు నిర్వచనం చెప్పాడు అని చెప్పాలి. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో భాగంగా అత్యధిక వికెట్లు తీసింది భువనేశ్వర్. కానీ బౌలర్లలో హీరో మాత్రం హార్థిక్ అని అని చెప్పాలి. మ్యాచ్ ని మలుపు తిప్పే బౌలింగ్ చేశాడు అతగాడు.
మహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తీ కార్ ల మధ్య భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఇఫ్తీకార్ ను అవుట్ చేసి భారత్ కు ఉపశమనం కలిగించాడు. ఇక ఆ తర్వాత ఒకే ఓవర్లో రిజ్వాన్, ఖుషి బిల్ షా ల వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ పెద్ద స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. బౌలింగ్ లో ఇలా అద్భుతం చేసి చూపించిన హార్దిక్ పాండ్య బ్యాటింగ్ లో కూడా తిరుగులేదు అని నిరూపించాడు అనే చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ వికెట్ కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి అడుగుపెట్టాడు హార్దిక్ పాండ్యా గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. ఆఖరులో అతను సిక్సర్తో మ్యాచ్ గెలిపించిన దృశ్యం ఎన్నో రోజుల పాటు అభిమానుల మనసులో నిలిచిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి