మరికొన్ని రోజుల్లో భారతజట్టు ఆస్ట్రేలియాతో 3 టి20 ల సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఇక ఈ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 20వ తేదీ నుంచి భారత్తో ప్రారంభం కాబోయే 3 టి20ల  సిరీస్ కు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా జట్టు  వివరాలను ఇటీవలే అధికారిక సోషల్ మీడియా ఖాతాలో  ప్రకటించింది. ఈ క్రమంలోనే అటు క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న ఒక నిర్ణయం కాస్త ప్రస్తుత అభిమానులందరినీ కూడా షాక్ కి గురి చేసింది అని చెప్పాలి.  ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో కొనసాగుతూ పరుగుల వరద పారిస్తున్న  డేవిడ్ వార్నర్ ను  సెలెక్షన్ కమిటీ పక్కనపెట్టేసింది.


 అయితే ఇలా డేవిడ్ వార్నర్ నీ పక్కన పెట్టడం వెనక ఒక పెద్ద కారణమే ఉంది అన్నది తెలుస్తుంది. టి20 ప్రపంచకప్కు ముందు ఆస్ట్రేలియా భారత్ కు  టి 20 సిరీస్ ఒక ప్రాక్టీస్ గా మారే అవకాశం ఉంది. టి20 ప్రపంచకప్ లో ఎంతో కీలకం కానున్న డేవిడ్ వార్నర్ కు విశ్రాంతి ఇవ్వాలని ఉద్దేశంతోనే సెలక్షన్ కమిటీ అతని పరిగణలోకి తీసుకోలేదు అని తెలుస్తోంది. డేవిడ్ వార్నర్ స్థానంలో భారత పర్యటనకు కెమెరాన్  గ్రీన్  ఎంపికయ్యాడు. మొహాలీలో సెప్టెంబరు 20 వ తేదీన మొదటి టి20 మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.


దాన తర్వాత సెప్టెంబర్ 23 వ తేదీన 2వ టి 20 నాగపూర్ వేదిక జరగబోతుంది.  సెప్టెంబర్ 25 వ తేదీన మూడవ టి20 మ్యాచ్ హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న  కామెరూన్ గురించి సెలక్షన్ కమిటీ  చీప్ జార్జ్ బెయిలీ స్పందిస్తూ ఇటీవలే చాలా మెరుగు అయ్యాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇటీవల ఇండియా పర్యటన కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.


అష్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), టిమ్ డేవిడ్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, కామెరాన్ గ్రీన్, ఆడమ్ జాంపా.

మరింత సమాచారం తెలుసుకోండి: