ఎవరైనా ప్రత్యర్థి ఆటగాళ్లు తనను అండరెస్టిమేట్ చేశారు అంటే తన సత్తా ఏమిటో తమకు ఆటతోనే చూపిస్తూ ఉంటాడు. ఇక ఇటీవల హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా రవీంద్ర జడేజా మరోసారి ఇలాంటిదే చేసి చూపించాడు అని చెప్పాలి. పాకిస్తాన్ పై విజయం సాధించిన టీమిండియా ఇటీవలె హాంకాంగ్ జట్టు మీద 40 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 68 విరాట్ కోహ్లీ 59 పరుగులతో చెలరేగిపోయాడు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే మ్యాచ్ మొత్తంలో రవీంద్ర జడేజా విసిరిన మెరుపు త్రో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
హాంకాంగ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఆరో ఓవర్లో అర్ష్ దీప్ సింగ్ ఐదో బంతిని నో బాల్ గా వేశాడు. ప్రత్యర్థికి ఫ్రీ హిట్ లభించింది. అయితే ఫ్రీ హిట్ ను హాంకాంగ్ సరిగా ఉపయోగించుకోలేకపోయింది. ఫ్రీ హిట్ బంతిని ఎదుర్కున్న హాంకాంగ్ కెప్టెన్ నిజకాత్ ఖాన్ డీప్ పాయింట్ దిశగా ఆడాడు. కనీసం సింగిల్ అయినా తీయాలని ప్రయత్నించాడు. కానీ నాన్ స్ట్రైక్ లో ఉన్న బాబర్ హయత్ సింగిల్ తిరస్కరించాడు. అ ప్పటికే బంతి జడేజా చేతుల్లో ఉంది. జడ్డు చేతుల్లోకి వచ్చిన తరువాత త్రో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జడేజా దెబ్బకు ఫ్రీ హిట్ కు కూడా టీమిండియాకు వికెట్ లభించింది. హాంగ్ కంగ్ కెప్టెన్ నిజకత్ రనౌట్ గా పెవిలియన్ చేరాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి