ఒకప్పుడు సెంచరీలతో చెలరేగిపోయిన విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో మ్యాచ్ లలో ఒంటిచేత్తో భారత జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు ఉన్నాయి. క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా విరాట్ కోహ్లీ తిరుగులేని ప్రస్థానం కొనసాగించాడు అనే చెప్పాలి. విరాట్ కోహ్లీ గత కొంతకాలం నుంచి మాత్రం ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మ్యాచ్లో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర స్థాయిలో అభిమానులందరినీ కూడా నిరాశపరిచాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే దాదాపు నెల రోజుల పాటు అతనికి విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ.


 నెల రోజుల విశ్రాంతి తర్వాత ఇటీవలే ఆసియా కప్ లో చేరిన విరాట్ కోహ్లీ మళ్ళీ మునుపటి ఫామ్ అందుకున్నట్లుగానే  కనిపించాడు. అద్భుతమైన షాట్లతో అలరించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరుసగా మూడు మ్యాచ్ లలో కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ప్రదర్శనపై అందరు ప్రశంసలు కురిపించారు. అయితే ఇటీవలే శ్రీలంకతో తో డూ ఆర్ డై మ్యాచ్ ఆడిన శ్రీలంకతో గెలిస్తే ఫైనల్ వెళ్లేందుకు భారత్ కు అవకాశాలు ఉన్నాయి. ఇక ఇలాంటి సమయంలో కోహ్లీ ప్రదర్శన ఒక రేంజ్లో ఉంటుందని అందరూ అనుకున్నారు.


 కానీ ఊహించని రీతిలో విరాట్ కోహ్లీ మాత్రం ఒక్క రన్ కూడా చేయకుండానే గోల్డెన్ డక్ ఔట్ గా వెనుదిరిగాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ ఖాతాలో ఒక చెత్త రికార్డు చేరిపోయింది. ఆసియా కప్ చరిత్రలో తొలిసారి టీ20 వన్డే ఫార్మాట్లో కూడా  ఒక్క రన్ చేయకుండా గోల్డ్ డకౌట్ గా వెనుదిరిగిన  ఏకైక ప్లేయర్గా విరాట్ కోహ్లీ ఒక కొత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ చెత్త రికార్డు  గురించి తెలిసి అభిమానులు కూడా నిరాశకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: