ఇటీవలే ఆసియా కప్లో భాగంగా నిరాశపర్చిన టీమిండియా మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కోసం సిద్ధం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఐసీసీ విధించిన నిబంధనల ప్రకారం ఇక ఇటీవలే టి20 వరల్డ్ కప్ ఆడబోయే భారత జట్టు వివరాలను కూడా ప్రకటించింది.  ఇక ఇటీవల బిసిసీఐ ప్రకటించిన భారత జట్టులో రవీంద్ర జడేజా పేరు కనిపించ లేదు అన్న విషయం తెలిసిందే. ఆసియా కప్లో భాగంగా మోకాలి గాయం బారినపడిన రవీంద్ర జడేజా జట్టుకు దూరమయ్యాడు.


 ఇక ఆ తర్వాత ఏకంగా అతని మోకాలికి సర్జరీ కూడా జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని సెలెక్టర్లు అతనికి సూచించారట. ఆసియా కప్ లోని కొన్ని కీలకమైన మ్యాచ్లకు టి20 వరల్డ్ కప్ కి కూడా అతను అందుబాటులో లేకుండా పోయాడు. అయితే అతను జట్టులో ఉంటే తప్పకుండా భారత జట్టు గెలుస్తుందని ప్రేక్షకులందరికీ నమ్మకం ఉంటుంది. ఎందుకంటే బౌలింగ్లో బ్యాటింగ్ లో ఫీలింగ్ లో ఆ రేంజ్ లో అదర కొడుతూ ఉంటాడు రవీంద్ర జడేజా.



 కానీ ఇప్పుడు మాత్రం అతను జట్టులో లేకపోవడంతో ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు అభిమానులు సైతం నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి. అతను జట్టు లో ఉంటే అదనపు బలం టీమిండియాకు తోడుగా ఉంది అని అనిపిస్తూ ఉండేది.. కానీ ఇప్పుడు రవీంద్ర జడేజా లేని లోటు టీమిండియాలో స్పష్టంగా కనిపిస్తోంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మిస్ యు జడేజా అని ఎంతో మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించారు.  తద్వారా జడేజా అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది అని చెప్పాలి. మరి జడేజా స్థానాన్ని ఎవరు భర్తీ చేసి బాధ్యత తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: