అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో విరాట్ కోహ్లీ ఎప్పుడు కనిపించిన ఎంతో స్పోర్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు. ప్రత్యర్ధులతో కూడా ఎంతో సరదాగా మాట్లాడుతూ కనిపిస్తాడు విరాట్ కోహ్లీ.. ఇక విరాట్ కోహ్లీ లో ఉన్న ఈ గుణమే అటు ప్రేక్షకులకు బాగా నచ్చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యర్థులతో ఎంతో సరదాగా మాట్లాడే విరాట్ కోహ్లీతమ జట్టును గెలిపించేందుకు ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే జట్టు గెలుపు కోసం కొన్ని కొన్ని సార్లు అరుదైన రికార్డులు క్రియేట్ చేయడం కూడా రెండో ఆలోచన చేయకుండా వదులుకుంటూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇకపోతే సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్య జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో కూడా ఇలాంటిదే చేసి ప్రేక్షకుల మనసు గెలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. రెండవ టి20 మ్యాచ్ లో భాగంగా విరాట్ కోహ్లీ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. మరో పరుగు చేసి ఉంటే హాఫ్ సెంచరీ పూర్తి చేసేవాడు విరాట్ కోహ్లీ.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నాలుగు బంతుల్లో ఒక శిక్ష ఒక ఫోర్ సహాయంతో పది పరుగులు చేశాడు దినేష్ కార్తీక్. ఇలాంటి సమయంలోనే నేను సింగిల్ తీసి నీకు ఇస్తాను నువ్వు హాఫ్ సెంచరీ పూర్తి చేయి అని దినేష్ కార్తీక్ చెబుతాడు. విరాట్ కోహ్లీ మాత్రం లేదు లేదు నువ్వు భారీ షాట్లు ఆడు అంటూ ఇక తన హాఫ్ సెంచరీని కూడా త్యాగం చేశాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోని నెటిజన్లు ఒకవైపు దినేష్ కార్తీక్ పై మరోవైపు విరాట్ కోహ్లీ చూపించిన క్రీడా స్ఫూర్తి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: