ఇకపోతే టీమిండియాలో సీనియర్ ప్లేయర్లుగా అత్యుత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్న ఇద్దరు కూడా కెప్టెన్సీలో ఎవరికి వారే సాటి అని చెప్పాలి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అటు టీమిండియా విదేశాల్లో విజయపథంలో దూసుకుపోయింది అని చెప్పాలి. మరోవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి కూడా టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్లను గెలుస్తూ రికార్డు సృష్టిస్తూ ఉంది. మొన్నటికి మొన్న మెగాటోర్ని ఆసియా కప్ లో మాత్రం రోహిత్ కెప్టెన్సీ లో టీమిండియా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ లో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే రోహిత్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ మధ్య తేడా గురించి ఇటీవల కివీస్ మాజీ ఆటగాడు కోరే అండర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరి కెప్టెన్సీ ఎంతో భిన్నంగా ఉంటుంది. విరాట్ మైదానంలో దూకుడుగా ఉంటాడు. తన ప్రణాళికలను అక్కడికక్కడ నిర్దేశించుకుంటాడు. కానీ రోహిత్ తాను ఏం చేయాలని అనుకుంటాడో దానిని పక్కాగా అమలు చేస్తాడు. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటూ జట్టు నుంచి అత్యుత్తమ ప్రదర్శన రావాలని కోరుకుంటాడు. మైదానంలోకి దిగేముందే ఫలితం కోసం ఏం చేయాలో ఒక అంచనాకు వస్తాడు రోహిత్. బౌలర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాలని ప్రయత్నిస్తాడు. అయితే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరూ అత్యుత్తమ సారధులే అంటూ చెప్పుకొచ్చాడు కోరే అండర్సన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి