టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇతని గురించి చెప్పుకోవాలంటే పేజీలకు పేజీలు రాయాల్సిందే. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ లో ఇతను కొనసాగించిన హవా అలాంటిది. అందరిలాగానే ఒక సాదాసీదా క్రికెటర్ గా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు విరాట్ కోహ్లీ. కానీ తక్కువ సమయంలోనే వచ్చిన అవకాశాలను ఒడిసిపెట్టి తాను అందరిలాంటి క్రికెటర్ని కాదని చరిత్రలో నిలిచిపోయే క్రికెటర్ ని అన్న విషయాన్ని తన ఆట తీరుతోనే నిరూపించాడు అని చెప్పాలీ.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఆట తీరు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను  చేస్తూ ఇక ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులను తనకు అభిమానులుగా మార్చేసింది. ఇక ఇప్పటివరకు తన ఆట తీరుతో అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఇక బ్యాటింగ్ తో తనకంటే అత్యుత్తమ ఆటగాడు ఇంకెవరూ లేరు అన్న విషయాన్ని ప్రేక్షకులకు నిరూపించాడు. ఇక మైదానంలో ఎంతో దూకుడుగా ఉంటూ కోహ్లీ కంటే ఎనర్జీతో ఉండే ఆటగాడు మరొకడు లేడు అన్న విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేశాడు.


 అంతేకాదు మైదానంలో ఎంతో పాదరసంలా కదులుతూ మెరుపు ఫీల్డింగ్ తో ఎన్నోసార్లు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఫీల్డింగ్ లో కూడా అటు విరాట్ కోహ్లీకి ఎవరు సాటి లేరు అన్న విషయాన్ని నిరూపిస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కూడా ఇదే చేసి చూపించాడు విరాట్ కోహ్లీ. తొలి వన్డే మ్యాచ్లో ఒక అద్భుతమైన క్యాచ్ అందుకొని అందరిని ఔరా అనిపించాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 23 ఓవర్ లో మూడవ బంతికి కళ్ళు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.  అప్పుడే సెట్ అయినా కీలక ప్లేయర్  కెప్టెన్ షకీబుల్ హసన్  పెవిలియన్ సాగినంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: