ఇటీవల బంగ్లాదేశ్ పర్యటన లో భాగంగా భారత జట్టు వన్డే సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే బంగ్లాదేశ్ ను భారత జట్టు చిత్తుగా  ఓడిస్తుందని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో భారత జట్టు మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. అన్ని పరిస్థితులు కూడా భారత్కు అనుకూలించిన సమయంలో కూడా భారత ఆటగాళ్లు పేలవమైన ఫీలింగ్ కారణంగా ఓటమిని కొనితెచ్చుకున్నారు.


 అంతేకాకుండా కీలకమైన క్యాచ్ లు కూడా వదిలేయడంతో చివరికి భారత జట్టు గెలవాల్సిన మ్యాచ్లో కూడా ఓడిపోయి తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ప్రదర్శన పై ఎంతో మంది అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి ప్రదర్శన చేస్తే రాబోయే వరల్డ్ కప్ లో కష్టమే  కష్టమే అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పాలి. కాగా టీమిండియా ఓటమిపై దినేష్ కార్తీక్ స్పందించాడు. టీమిండియా ఇంత చెత్తగా ఫీల్డింగ్ చేస్తుందని  తాను అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్ వదిలేసిన క్యాచ్ను సుందర్ ఎందుకు పట్టుకునేందుకు ప్రయత్నించలేదు అంటూ ప్రశ్నించాడు.


 కేవలం ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా మాత్రమే టీమిండియా ఓడిపోయింది అంటూ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. చివరి ఓవర్లో హాసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను రాహుల్ పట్టి ఉంటే బాగుండేది అంటూ వ్యాఖ్యానించాడు. ఇక మొదటి వన్డే మ్యాచ్లో భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ వల్ల తాను అసహనానికి గురయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో బ్యాటింగ్ లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అంటూ తెలిపాడు. చివరి ఓవర్లో ఒత్తిడి కారణంగా కొన్ని బౌండరీలు వదిలేసి ఉండవచ్చు అని దినేష్ కార్తీక్ అభిప్రాయం వ్యక్తం చేసాడు. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk