మరీ ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో అయితే రషీద్ ఖాన్ మించిన స్పిన్నర్ మరొకరు లేరేమో అనేంతలా అతను ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. అటు అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు దేశవాళీ లీగ్ లలో కూడా అదే రీతిలో సత్తా చాటుతూ అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. దీంతో ఇక రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్ను తమ జట్టులో చేర్చుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు కూడా పోటీ పడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అని చెప్పాలి..
ఈ క్రమంలోనే ఇక వరుసగా మ్యాచ్ లలో కీలకమైన వికెట్లు తీసి అదరగొడుతున్నాడు. ఇక ఇటీవల ఒక అరుదైన ఘనత కూడా సాధించాడు అని చెప్పాలి. టీ20 కెరియర్ లో ఇప్పటివరకు 389 ఇన్నింగ్స్ లు ఆడిన రషీద్ ఖాన్ 530 వికెట్లు తీసాడు. ఇక రషీద్ ఖాన్ 24 ఏళ్ల వయసులోనే 500 వికెట్లు పూర్తి చేయగా.. కెరియర్ పూర్తయ్యలోపు టి20 ఫార్మాట్లో ఎంతో సులభంగా 1000 వికెట్ల మార్కును అందుకుంటాడు అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. కాగా రషీద్ ఖాన్ కెరియర్ లో బెస్ట్ గణాంకాలు 17 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీయడం అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి