అయితే ఇలా ఐపీఎల్ లో ఇక అన్ని సీజన్లలో కూడా మంచి ప్రదర్శనలు చేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో మొన్నటి వరకు రెండో స్థానంలో కొనసాగాడు చాహాల్. కానీ ఇటీవల ఓ అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇటీవల రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్లో భాగంగా మ్యాచ్ జరిగింది. నువ్వా నేనా అన్నట్లుగా చివరి బంతి వరకు నరాలు తెగ ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్ ఓడిపోయినప్పటికీ ఆ జట్టు బౌలర్ చాహాల్ మాత్రం అరుదైన రికార్డు సృష్టించాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు చాహల్. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బ్రావోతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. బ్రావో 161 మ్యాచ్ లలో 183 వికెట్లు తీస్తే చాహల్ 141 మ్యాచుల్లోనే 183 వికెట్లు తీసాడు. ఇక వీరి తర్వాత 174 వికెట్లతో పీయూష్ చావ్లా మూడో స్థానంలో ఉన్నాడు. అయితే టీమ్ ఇండియా తరఫున ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్గా అటు చాహల్ అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. ఇక ఇది తెలిసి ఫాన్స్ తెగ ఆనంద పడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి