
అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇక్కడ డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ గురించి స్పందిస్తూ ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇరు జట్ల బలాబాలాలు ఏంటి అనే విషయం పైన చర్చించుకుంటున్నారు. అంతేకాదు తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయం గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
డబ్ల్యూటీసి ఫైనల్లో విజయావకాశాలు ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉన్నాయి అంటూ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తో పోల్చి చూస్తే ఆస్ట్రేలియా నే కాస్త ఫేవరెట్ గా కనిపిస్తుంది ఓవల్ మైదానంలో పిచ్ కండిషన్స్ భారత్ కంటే ఆస్ట్రేలియా కె ఎక్కువగా సూట్ అవుతాయి. అంతేకాకుండా ఇక భారత ఆటగాళ్లందరూ మొన్నటి వరకు ఐపీఎల్ ఆడి అలసిపోయి ఇప్పుడు డబ్ల్యూటీసి ఫైనల్ ఆడబోతున్నారు. కానీ అటు ఆస్ట్రేలియా ప్లేయర్లు మాత్రం ఎంతో ఫ్రెష్ గా బరిలోకి దిగబోతున్నారు అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఇవన్నీ కూడా మ్యాచ్ ను ప్రభావితం చేస్తాయి అంటూ వ్యాఖ్యానించాడు.