టీమిండియా యంగ్ సెన్సేషన్ శుభమన్ గిల్ గత కొంతకాలం నుంచి సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే.. 2023 ఐపీఎల్ సీసన్ లో అయితే అతని ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. 17 ఇన్నింగ్స్ లలో  890 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా ఇచ్చి ఆరెంజ్ క్యాప్ ని కూడా దక్కించుకున్నాడు. ఒకరకంగా గుజరాత్ టైటాన్స్ ఫైనల్ వరకు వెళ్ళింది అంటే ఇక అందులో గిల్ ఆడిన ఇన్నింగ్స్ లదే కీలకపాత్ర అని చెప్పాలి. ఏకంగా మూడు సెంచరీలు నాలుగు అర్థ సెంచరీలు చేసి అదరగొట్టాడు.



 అయితే గిల్ లాంటి ప్లేయర్ గుజరాత్ టైటాన్స్ కి దొరకడం అదృష్టమని.. ఆ జట్టు అభిమానులు అనుకుంటుంటే..  ఇప్పుడు గిల్ వచ్చే ఏడాది ఐపిఎల్ సీజన్ నుంచి ఇక గుజరాత్ టైటాన్స్ నుంచి తప్పుకోబోతున్నాడు అన్న వార్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇప్పటికే మూడు ఫార్మాట్లలో ఓపనర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 23 ఏళ్ల గిల్ కీ కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటూ ఇప్పటికే ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికే హార్దిక్ పాండ్యా టీమిండియా కెప్టెన్సీ అందుకోవడం ఖాయంగా మారిపోయింది. ఇక గుజరాత్ కెప్టెన్ గా కూడా అతనే కొనసాగుతాడు. దీంతో గుజరాత్ జట్టులో ఉంటే కెప్టెన్ అయ్యే ఛాన్స్ గిల్ కు రాదు.


 దీంతో మంచి మంచి కెప్టెన్ కోసం ఎదురు చూస్తున్న పంజాబ్ లేదంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి గిల్ వెళ్లాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే గుజరాత్ ను వీడి ఇక కొత్త ఫ్రాంచీలోకి వెళ్లాలని అనుకుంటున్నాడట. అయితే ఇప్పటికే రోహిత్ సొంత రాష్ట్రమైన ముంబైకి.. హార్దిక్ పాండ్యా సొంత రాష్ట్రమైన గుజరాత్ కు కెప్టెన్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు గిల్ సైతం తన సొంత రాష్ట్రమైన పంజాబ్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించాలని అనుకుంటున్నాడట. ఒకవేళ అది కుదరకపోతే ఇక సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడాలని భావిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl