ఈ సిరీస్లో విజయాన్ని ఇరు జట్లు కూడా గౌరవంగా భావిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతాయి. ఇక ఈ సిరీస్ జరిగేటప్పుడు ఆటగాళ్ల మధ్య పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇరుదేశాలకు చెందిన ఫ్యాన్స్ మధ్య అంతకుమించిన పోటీ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ఏకంగా ప్రేక్షకులు ప్రత్యర్థి జట్టు ఆటగాడిని ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు.. వారి ఏకాగ్రతను ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సిరీస్ లో భాగంగా బర్మింగ్ హామ్ లోనే ఎడ్జ్ బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్లో ఇలాంటిదే జరిగింది.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్స్ స్మిత్ కు చేదు అనుభవం ఎదురయింది. నాలుగు రోజు ఆటలో భాగంగా బౌండరీ లైన్ దగ్గర స్మిత్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ ఫ్యాన్స్ 2018లో బాల్ టాంపరింగ్ విషయంలో స్మిత్ మీడియా ముందుకు కన్నీరు పెట్టుకున్న విషయాన్నీ గుర్తు చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. నువ్వు టీవీలో ఏడుస్తూ ఉండడం మేము చూసాం అంటూ స్టేడియం లో ఉన్న ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక పాట రూపంలో గట్టిగా నినాదాలు చేశారు. ప్రేక్షకులు ఇలా నినాదాలు చేయడంతో స్మిత్ చాలా ఇబ్బంది పడ్డాడు. పైకి నవ్వుతూ ఇంకా గట్టిగా అరవండి అంటూ తల ఊపిన అతని ముఖంలో మాత్రం బాధ స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి