ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెష్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ - ఇండియా తర్వాత చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగుతున్న ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడూ మ్యాచ్ జరిగినా కూడా ఉత్కంఠ ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ఇక రెండు జట్లు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెష్ సిరీస్ లో మ్యాచ్ అంటే ఆ ఉత్కంఠ రెట్టింపు అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ రెండు టీమ్స్ కూడా యాషెష్ సిరీస్ లో భాగంగా నువ్వా నేనా అన్నట్లుగానే తలబడుతూ ఉన్నాయి.


 అయితే అటు మొన్నటికి మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా పై విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఇక ఇప్పుడు యాషెష్ సిరీస్ లో కూడా అదే జోరును కొనసాగిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధించిన ఆసిస్ ఇక రెండో మ్యాచ్లో కూడా అదే రీతిలో చరిష్మాను కొనసాగించి విజయం సాధించింది. అయితే రెండవ మ్యాచ్ లో అటు ఇంగ్లాండ్ టీం ఓడిపోయినప్పటికీ ఇక ఆ జట్టు కెప్టెన్ బెన్  స్టోక్స్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ప్రేక్షకుల మనసు గెలుచుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బెన్  స్టోక్స్ ఇన్నింగ్స్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.



 ఈ క్రమంలోనే బెన్  స్టోక్స్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన టీమిండియా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ ఇక అతనిపై ప్రశంసలు కురిపించాడు అని చెప్పాలి. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు బెన్  స్టోక్స్ మాత్రం అద్భుతమైన పోరాటం చేశాడు అంటూ ప్రశంసించాడు. ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలో బెన్  స్టోక్స్ కి బాగా తెలుసు అంటూ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. అయితే ఇక అతను బ్యాటింగ్ చేస్తున్న తీరు అచ్చం టీమిండియా బ్యాట్స్మెన్  పంత్ లాగే ఉంది అంటూ కామెంట్ చేశాడు ఈ మాజీ క్రికెటర్. కాగా 214 బంతుల్లో 155 పరుగులు చేసి ఇక జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించగలిగాడు బెన్  స్టోక్స్. కానీ జట్టు ఓడిపోవడంతో అతని పోరాటం వృధాగానే మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: