ఏకంగా అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడా విధి ఏకంగా పగబట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుంది అని చెప్పాలి. వెరసి చివరికి అనూహ్య రీతిలో ప్రాణాలు పోతూ ఉంటాయి. చిన్నారులు తెలిసి తెలియక చేసిన పనుల కారణంగా ప్రాణాలు పోయి చివరికి కుటుంబంలో విషాదం మిగులుతూ ఉంటుంది. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి ఇప్పుడు వెలుగులోకి వచ్చినా ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. సాధారణంగా చిన్నపిల్లలు లాలీపాప్ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.
ఇక ఎప్పుడు షాప్ కి తీసుకువెళ్లిన లాలీపాప్ కొనివ్వాలి అని మారాం చేస్తూ ఉంటారు. కానీ ఇలా లాలీపాప్ తినడం కూడా పిల్లల ప్రాణాలు తీస్తుందా అంటే ఇక్కడ ఒక ఘటన మాత్రం ఇందుకు నిదర్శనంగా మారిపోయింది. ఎంతో సంతోషంగా లాలీపాప్ కొనుక్కొని తింటున్నాడు ఆ బాలుడు. కానీ అదే అతని ప్రాణం తీస్తుంది అని ఊహించలేకపోయాడు. లాలీపాప్ గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని ఈసీఐఎల్ లో వెలుగు చూసింది. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన 8 ఏళ్ల గౌతం దుకాణంలో లాలిపాప్ కొనుక్కుని తింటున్నాడు. అయితే లాలీపాప్ గొంతులో ఇరుకొని ఊపిరాడక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇక తల్లిదండ్రులు అతని మృతదేహాన్ని స్వగ్రామమైన ఖమ్మంలోని కామేపల్లికి తీసుకెళ్లారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి