ఈ క్రమంలోనే వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో ఘనవిజయాన్ని సాధించిన టీమిండియా.. ఇక నేడు రెండో మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్, వెస్టిండీస్ మధ్య జరగబోయే రెండో వన్డే మ్యాచ్ బార్బడోస్ వేదికగా జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్లో విజయం సాధించిన టీమ్ ఇండియా రెండో మ్యాచ్లో కూడా విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని భావిస్తూ ఉంది. ఇక ఈ మ్యాచ్ సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది అని చెప్పాలి.
అయితే ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోవడం కాదు.. అటు మొదటి వన్డే మ్యాచ్ లో కూడా ఓడిపోయిన వెస్టిండీస్ రెండవ వన్డే మ్యాచ్లో మాత్రం గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తుంది అని చెప్పాలి. అయితే తొలి వన్డేలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినట్లుగానే.. రెండో వన్డేలో కూడా కొత్త ప్లేయర్స్ కే మరోసారి తుది జట్టులో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇలా సిరీస్ కోసం కోసం టీమిండియా మరోవైపు సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకునేందుకు వెస్టిండీస్ నేడు హోరాహోరీగా పోరాడే అవకాశం ఉంది. ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి