ఇక అతనికి కెప్టెన్సీ అద్భుతం అంటూ ఎంతో మంది మాజీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. మైదానంలో ఆటగాళ్లకు హార్థిక్ పాండ్యా స్వేచ్ఛ ఇస్తున్నాడని అతనికి కెప్టెన్సీ వ్యూహాలు కూడా బాగున్నాయి అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే ఇలా కెప్టెన్ గా ఇప్పుడు వరకు ప్రశంసలు అందుకున్న హార్దిక్ ఇక ఇటీవల చేసిన పనికిమాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో బరిలోకి దిగింది టీమిండియా. అయితే ఇటీవల జరిగిన మూడో టి20 మ్యాచ్ లో హార్దిక్ కాస్త సెల్ఫిష్ గా ఆలోచించాడు.
టి20 సిరీస్ లో భారత బ్యాటింగ్ విభాగం మొత్తం విఫలమవుతున్న వేళ తెలుగు క్రికెట్ తిలక వర్మ మాత్రం.. మంచి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మొదటి మ్యాచ్ లో 39, రెండో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ, మూడో మ్యాచ్లో 49 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. అయితే తిలక్ వర్మ 49 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు కెప్టెన్ గా హార్దిక్ అతనికి స్ట్రైక్ ఇచ్చి హాఫ్ సెంచరీ చేసేందుకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ ఫినిషర్ అనే పేరు తెచ్చుకునేందుకు చివర్లో సిక్సర్ కొట్టి తానే మ్యాచ్ ను ముగించాడు. దీంతో హార్థిక్ పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి. యువ ఆటగాడైన తిలక్ వర్మకు హాఫ్ సెంచరీ చేసే ఛాన్స్ ఇచ్చి ఉంటే. అతనిలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగేది అంటూ ఎంతమంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి