ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండి అక్కడ మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ లు ఆడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  వన్డే, ఫార్మాట్ తో పాటు టెస్ట్ ఫార్మాట్ లో కూడా సిరీస్ ను సొంతం చేసుకుంది  టీమ్ ఇండియా. ఆతిథ్య  వెస్టిండీస్కు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా అదిరిపోయే ప్రదర్శన చేసి ప్రశంసలు అందుకుంది అని చెప్పాలి. అయితే ఈ రెండు ఫార్మట్లలో అదరగొట్టిన టీమిండియా ఎందుకో టి20 ఫార్మాట్లో మాత్రం తడబడింది. సీనియర్లు లేకుండా యంగ్ ప్లేయర్స్ తో బరిలోకి దిగిన టీమిండియా ఎక్కడ వెస్టిండీస్ కు పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి.


 వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన టీమ్ ఇండియా అభిమానులు అందరినీ ఆందోళనలో పడేసింది. కానీ ఆ తర్వాత రెండు మ్యాచ్లలో పుంజుకుని విజయం సాధించడంతో సిరీస్ మనదే అనే నమ్మకం భారత అభిమానుల్లో వచ్చింది. కానీ ఐదవ టి20 మ్యాచ్ లో గెలుపు కోసం పోరాల్సిన టీమ్ ఇండియా చేతులెత్తేసింది. దీంతో ఐదో టి20 మ్యాచ్ లో గెలిచిన వెస్టిండీస్ టి20 సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే అటు భారత ప్లేయర్లు ఎక్కడ ఆటతీరుతో ప్రభావితం చేయకపోవడంతో ఇక తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. వరల్డ్ ముందు టీమిండియా నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించలేదు అంటూ ఎంతో మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


 అయితే ఇలా వెస్టిండీస్ చేతిలో టి20 సిరీస్ ఓడిపోయిన టీమ్ ఇండియా పై తీవ్ర విమర్శలు రావడం గురించి భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. వెస్టిండీస్తో జరిగిన టి20 సిరీస్ నుంచి మనం ఎన్నో పాజిటివ్స్ కూడా తీసుకోవచ్చు. యంగ్ ప్లేయర్స్ వెస్టిండీస్ లో ఆడటం అంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అక్కడి పరిస్థితులు వెస్టిండీస్ ప్లేయర్లకు తెలిసినంతగా ఇంకా ఎవ్వరికీ అర్థం కాదు. ఈ సిరీస్ ద్వారా యంగ్ ప్లేయర్స్ అనుభవం పొందారు. ఇప్పుడు వాళ్లు మరింత మెరుగవుతారు అంటూ అశ్విన్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: