టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సార్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇండియాను గెలిపించాడు. ఇక టెస్టుల్లో ఒక్క ఓవర్లోనే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన మ్యాచులు చాలానే ఉన్నాయి. ఇక ధోని వికెట్ కీపింగ్ చేస్తుంటే స్పిన్నర్లకు మరింత ప్లస్ అవుతుంది. టెస్టుల్లోనే కాదు వన్డేల్లో కూడా అశ్విన్ ఎన్నో సార్లు అద్భుతంగా రాణించాడు. స్వదేశంలో జరిగే మ్యాచుల్లో బ్యాట్స్ మెన్ ని ఇబ్బంది పెట్టేవాడు. అయితే ఇప్పుడు అశ్విన్ కెరీర్ ముగింపు దశకు వచ్చేసిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు అశ్విన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

నా చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నేనెప్పుడో నిర్ణయించుకున్నా. ప్రస్తుతం నా వ్యక్తిగత జీవితం, క్రికెట్‌ కెరీర్‌ సజావుగా సాగుతోంది. ప్రతికూల అంశాల గురించి అస్సలు ఆలోచించను. నెగటివిటీని దరిచేరనివ్వను’’ అని అశ్విన్‌ అన్నాడు. త్వరలోనే వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. అయితే ఈ టోర్నీలో అశ్విన్ కు ఛాన్స్ దొరకడం కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో జడేజా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక జడేజాకి తోడుగా కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చహల్‌, రవి బిష్ణోయి ఆడే ఛాన్స్ కూడా ఉంది.

అశ్విన్ మాట్లాడుతూ నేను జట్టులో ఉన్నా, లేకున్నా ఈసారి ప్రపంచకప్ ఇండియా గెలవాలని కోరుకున్న అని తెలిపాడు. తాను బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తున్నానని అశ్విన్ తెలిపాడు. నేను మ్యాచ్‌ ఆడినా.. ఆడకపోయినా.. టీమిండియా మరోసారి వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడితే చూడాలని ఉంది అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

ప్లేయర్లకు గాయాలు అనేది సహజమేనని కానీ గాయాల కారణంగా రిటైర్ అవ్వకూడదని, గాయాల కారణంగా రిటైర్మెంట్ ప్రకటించానని అశ్విన్ స్పష్టం చేసాడు. సౌతాఫ్రికా టూర్‌ దాకా విశ్రాంతి దొరుకుతుందని అశ్విన్‌ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: