బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా ఎంతో మంది ప్లేయర్లు తెరమీదకి వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత క్రికెట్లో యంగ్ ప్లేయర్స్ కి కొదవ లేకుండా పోయింది. అయితే ఆయా ఆటగాళ్లు ఇక ఐపీఎల్ లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ సత్తా ఏంటో నిరూపించుకుంటూ ఉంటారు. ఇలా వచ్చిన ఆటగాళ్ళు ఎంతోమంది తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలో ఛాన్స్ దక్కించుకోవడం కూడా చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే.


 అయితే 2023 ఐపీఎల్ సీజన్లో కేవలం ఒకే ఒక ఇన్నింగ్స్ తో హీరోగా మారిపోయిన ప్లేయర్ ఒకరు ఉన్నారు. అతని ఎవరో అందరికీ తెలిసే ఉంటుంది. అతను ఎవరో కాదు రింకు సింగ్. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రింకు సింగ్ చివరి మ్యాచ్లో ఐదు సిక్సర్లు కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు అంతే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు మొత్తం అతను వైపు చూసేలా ప్రభావితం చేసాడు. ఆ తర్వాత కూడా కొన్ని మ్యాచ్లలో సూపర్ ఫినిషింగ్ తో ఆకట్టుకున్నాడు.  ఇక సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఇక టీమిండియాలో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు.


 ప్రస్తుతం బుమ్రా కెప్టెన్సీలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.  ఈ క్రమంలోనే అతని ప్రదర్శన గురించి ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోరే. ధోని, యువరాజు లాగానే రింకు సింగ్ కూడా సంచలనంగా ఆడుతున్నాడని.. అద్భుత ఫినిషర్ కాగలడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేసాడు. ఐపిఎల్ లో 14 మ్యాచ్ లలో  474 పరుగులు చేశాడు. ధోని యువరాజ్ తర్వాత 5, 6 స్థానాలలో సరైన బ్యాట్స్మెన్లు టీమ్ ఇండియాకు దొరకలేదు. ఇప్పుడు రింకుతో ఆ లోటు తీరిపోతుంది. అతను అద్భుతమైన బ్యాట్స్మెన్ మాత్రమే కాదు ఫీల్డర్  కూడా అంటూ కిరణ్ మోరే వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: