ఇలా ఎంతో మంది స్టార్ క్రికెటర్లు అతి తక్కువ వయసులోనే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ అభిమానులకు షాకిస్తూ ఉన్నారు. ఇది కాస్త ఇక వరల్డ్ క్రికెట్లో కూడా చర్చనీయంశంగా మారిపోతుంది అని చెప్పాలి. ఇక దక్షిణాఫ్రికా క్రికెట్లో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న మరో బ్యాట్స్మెన్ ఇలాంటి రిటైర్మెంట్ నిర్ణయం తీసుకొని ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. ఏకంగా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ క్వెంటెన్ డికాక్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికి 2021 లో టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేసిన అతను ఇక భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
కాగా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జట్టు తరఫున స్టార్ ఓపెనర్ గా కొనసాగుతూ ఉన్నాడు డీకాక్. ఇక సౌత్ ఆఫ్రికా తరఫున 54 టెస్ట్ మ్యాచ్లు 140 వన్డే మ్యాచ్లు ఆడాడు. రెండు ఫార్మట్లలో కలిపి 9264 పరుగులు చేశాడు. గతంలో టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించినా డీకాక్ ఇక ఇప్పుడు వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ అనౌన్స్ చేసాడు. ఇప్పటినుంచి ఆ దేశం తరఫున టీ20 లు పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించబోతున్నాడు అని చెప్పాలి. ఏది ఏమైనా ఇలా 30 ఏళ్ల వయసులోనే అతను వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవడాన్ని అటు అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి