అయితే మొదటి నుంచి నువ్వా నేనా అన్నట్లుగానే ఈ పోరు సాగినప్పటికీ చివరికి వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే చివరికి రద్దు అయింది అన్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు నిరాశ చెందారు. కానీ ఇప్పుడు నేడు మరోసారి భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం మళ్లీ అందరూ ఎదురు చూడటం మొదలుపెట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది అని చెప్పాలి. ఇక కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే వర్ష సూచన ఉన్న నేపథ్యంలో వర్షం రాకుండా ఉంటే బాగుండు అని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ పేరు ఎత్తితే చాలు బ్యాటింగ్ తో విరుచుకుపడే విరాట్ కోహ్లీకి ఇక నేడు మ్యాచ్ జరగబోయే కొలంబోలో ఎలాంటి రికార్డులు ఉన్నాయి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే కొలంబో స్టేడియంలో గత మ్యాచ్లలో టీమ్ ఇండియా రన్మిషన్ విరాట్ కోహ్లీ చూపిన ప్రదర్శనను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. గత మూడు ఇన్నింగ్స్ లలో విరాట్ కోహ్లీ 128, 136, 110 పరుగులు చేశాడు. దీంతో పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తనకు బాగా అచ్చోచ్చిన కొలంబో మైదానంలో పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు అని అటు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి